: ఏపీలో ఐదు కార్పొరేషన్లకు ఛైర్మన్లు వీరే!
ఏపీలో ఐదు కార్పొరేషన్లకు ఛైర్మన్లను టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బోయ సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ పదవిని కర్నూలు జిల్లా బీటీ నాయుడుకి ఇచ్చారు. సాగునీటి అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవికి మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ (కేఈ కృష్ణమూర్తి సోదరుడు)కు ఇచ్చారు. గోదావరి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ వదవిని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన గన్ని కృష్ణకు కట్టబెట్టారు. మత్స్యకార అభివృద్ధి సంస్థ అధ్యక్ష పదవిని నెల్లూరు జిల్లాకు చెందిన పోలిశెట్టికి ఇచ్చారు. మెడికల్ అండ్ హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్ గా బీజేపీ నేత లక్ష్మీపతిని నియమించారు.