: ఆ హక్కును భారత్ ఎప్పుడో కోల్పోయింది: పాకిస్థాన్


భారత్ పై పాకిస్థాన్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. భారత్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతింటాయని దాయాది దేశం విమర్శించింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్ జకారియా మాట్లాడుతూ, భారత సైనికుల తలలను తాము నరకలేదని అన్నారు. తమపై అనవసరంగా భారత్ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు.

తమపై చేస్తున్న ఆరోపణలను ఐక్యరాజ్యసమితి ముందు ఉంచే హక్కు కూడా భారత్ కు లేదని... ఆ హక్కును భారత్ ఎప్పుడో కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఐక్యరాజ్యసమితికి భారత్ ఎన్నడూ కట్టుబడి ఉండలేదని చెప్పారు. ఐక్యరాజ్యసమితి మిలిటరీ అబ్జర్వర్స్ గ్రూప్ కు భారత్ ఎన్నడూ కట్టుబడి ఉండలేదని విమర్శించారు. కశ్మీర్ లో చేస్తున్న దురాగతాలను కప్పిపుచ్చుకోవడానికే... భారత్ ప్రతిసారి పాకిస్థాన్ కార్డును ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. 

  • Loading...

More Telugu News