: హైదరాబాదులోని ఓ కుటుంబంలో విషాదం నింపిన ట్రంప్ నిర్ణయం!


బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న సంజీవ్ శర్మ కుటుంబంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం విషాదం నింపింది. ట్రంప్ వీసా బ్యాన్ తరువాత ఏర్పాటు చేసిన నిబంధనల కారణంగా...భారత్ కు వచ్చిన సంజీవ్ శర్మకు వీసా రెన్యువల్ కాలేదు. దీంతో అంతకుముందు సంపాదించిన డబ్బుతో షేర్లలో పెట్టిన పెట్టుబడులను అత్యవసరంగా అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన నష్టాలపాలయ్యాడు.

ఈ నేపథ్యంలో సంజీవ్ శర్మ భార్య రష్మీ శర్మ డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. అమెరికా నుంచి హైదరాబాదుకు వచ్చిన అనంతరం... ఢిల్లీకి ట్రాన్స్ ఫర్ చేసుకోవాలంటూ ఆమె పలుమార్లు భర్తపై ఒత్తిడి చేసింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఇద్దరు కుమారులను తీసుకుని కంప్యూటర్ బాగు చెయ్యించేందుకు సంజీవ్ శర్మ బయటకు వెళ్లిన సమయంలో... కుమారుల భవిష్యత్ పై ఆందోళన, భర్త ట్రాన్స్ ఫర్ చేయించుకోకపోవడం వంటి కారణాలతో రష్మీ శర్మ ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు కుమారులతో కలిసి రాత్రి తిరిగి వచ్చిన సంజీవ్ శర్మకు రష్మీ శర్మ విగతజీవిగా కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News