: గోవాలో ఇక బహిరంగంగా మద్యం తాగితే జైలుకే.. !: పోలీసుల హెచ్చరిక
గోవా.. పర్యాటకులకు స్వర్గధామమైన ఇక్కడ ఇక నుంచి బహిరంగంగా మద్యం తాగడం నిషేధం. ఎవరైనా ఇలా తాగుతూ కనిపిస్తే జైలుకు పంపిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పర్యాటకులతో నిత్యం కళకళలాడే గోవాలో బహిరంగంగా మద్యం తాగడం భారతీయ శిక్షాస్మృతి 34 ప్రకారం నేరమని నగర పోలీసు సూపరింటెండెంట్ కార్తీక్ కశ్యప్ హెచ్చరించారు. సామాన్య పౌరులు, ప్రజాప్రతినిధులు, పర్యాటకరంగ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.