: ఆ మాయలేడి బెడ్ రూం నిండా కెమెరాలే... ఏకంగా 25 మంది ఎంపీలను మోసం చేసింది!
తనను ఓ మహిళ బెదిరిస్తోందంటూ ఇటీవల గుజరాత్ బీజేపీ ఎంపీ కేసీ పటేల్ చేసిన ఫిర్యాదు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఆ మాయలేడిపై విచారణ చేపట్టిన పోలీసులకు విస్మయం కలగజేసే నిజాలు తెలిశాయి. ఆ మహిళ మొదట వయసు పైబడిన ఎంపీల వివరాలు సేకరిస్తోందని, ఆ తరువాత మోసాలకు పాల్పడుతుందని పోలీసులు గుర్తించారు. ఆ మాయలేడీ ఐఏఎస్ చదివి కలెక్టర్ కావాలనుకుందని, అయితే, అందుకు తగ్గ కృషి చేయకపోవడంతో ఆమె ఐఏఎస్ కాలేకపోయిందని పోలీసులు తెలిపారు.
అనంతరం ఆమె రాజస్థాన్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిందని, ఆ కల కూడా నెరవేరలేదని చెప్పారు. ఇక, ఆమె ఎంపీలను మోసం చేసి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని మోసాలకు పాల్పడిందని వివరించారు. వయసులో పెద్ద వారైన ఎంపీల ఫోన్ నంబర్లను సేకరించి, వారికి పోన్ చేసి కమ్మగా మాట్లాడుతుందని చెప్పారు. అనంతరం ఆ ఎంపీలను తన ఇంటికి రమ్మని పిలుస్తుందని, ముందుగానే తన బెడ్ రూంలో కెమెరాలను సెట్ చేసుకుని ఉంటుందని తెలిపారు. ఆమె చెప్పిన మాటలు నమ్మి ఆమె ఇంటికి వచ్చిన ఎంపీకి మత్తు మందు ఇస్తుందని, అనంతరం ఎంపీతో అసభ్యకర రీతిలో ఫొటోలు, వీడియోలు తీసి డబ్బులు డిమాండ్ చేస్తోందని పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో ఆమె ఇప్పటి వరకు 25 మంది ఎంపీలను మోసం చేసి, ఇటీవలే గుజరాత్ ఎంపీని మాయ చేసి, ఆయనతో అసభ్యకర పొజిషన్లలో ఫొటోలు దిగి రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని వివరించారు. ఆ మహిళ బెడ్ రూం నిండా కెమెరాలు ఉంటాయని, అంతేగాక ఆమె వద్ద స్పై కెమెరాలు కూడా ఉంటాయని పోలీసులు తెలిపారు.