: మనం రెడీగా ఉన్నాం...కిమ్ జాన్ ఉంగ్ బరితెగిస్తే...ఇలా కోరలు పీకేస్తాం: అమెరికా మిలటరీ జనరల్
అమెరికా సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తూ...ఎప్పటికప్పుడు బెదిరింపులకు దిగుతున్న కిమ్ జాంగ్ ఉన్ ను ఎలా దెబ్బతీయాలో తమకు తెలుసని అమెరికా మిలటరీ జనరల్ ఆ దేశ శాసనసభ సబ్ కమిటీ సమావేశంలో వివరించారు. కిమ్ జాంగ్ ఉన్ హెచ్చరికల నేపథ్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన అగ్రరాజ్యం...ఉత్తరకొరియా శక్తి సామర్థ్యాలు, ఆ దేశం తయారు చేసిన అణ్వాయుధాలు, దాడుల తీవ్రత వంటి అన్ని అంశాలపై కులంకషంగా చర్చించింది. అమెరికా మిలిటరీ జనరల్ రేమండ్ ఏ.థామస్ మరో ఆసక్తికర అంశాన్ని ఈ మీటింగ్ లో వెల్లడించారు. అదేంటంటే... అనివార్య పరిస్థితుల్లో యుద్ధం తప్పనిసరైతే ఉత్తరకొరియా ఆటలు సాగనివ్వకుండా ఉండేందుకు ఉత్తర కొరియాకి చెందిన అణ్వాయుధ, క్షిపణి వెబ్ సైట్లను ధ్వంసం చేయగల అత్యాధునిక శాస్త్ర సాంకేతిక దళం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
సుశిక్షితులైన ఈ దళంలోని సభ్యులు ప్రపంచంలోని ఏ మూలనున్న వెబ్ సైట్లనైనా సులభంగా ధ్వంసం చేయగలరని అన్నారు. ఈ దళం ఇప్పటికే కొరియన్ వెబ్ సైట్లపై ఓ కన్నేసి ఉంచిందని ఆయన చెప్పారు. అంతే కాకుండా అవసరమైతే ప్రపంచంలోని 80 దేశాల్లో దాదాపు 8000 మందితో సిధ్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. అయితే అమెరికా అంచనాలకు అందకుండా అడుగులు వేసే కిమ్ జాంగ్ ఉన్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడో తెలియాల్సి ఉంది.