: పూటుగా తాగింది... వేగంగా కారు నడిపింది.. పేరడిగితే 'హిల్లరీ క్లింటన్' అని చెప్పింది!


అమెరికాలో ఓ మహిళ పూటుగా మద్యం తాగి వేగంగా కారునడిపింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను దాటుకుంటూ వెళ్లి...పట్టుకుంటే తన పేరు హిల్లరీ క్లింటన్ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి షాకిచ్చిన ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే....అమెరికాలోని పెన్సిల్వేనియాలో తెల్లవారుజామున పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ చేపట్టారు. ఈ సమయంలో పీకలదాకా తాగి వేగంగా కారు నడుపుతున్న ఓ మహిళను పోలీసులు అడ్డుకున్నారు.

అయితే, ఆమె పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో ఆమెను వెంబడించి నిలువరించి, విచారించారు. ఈ సందర్భంగా, తన పేరు హిల్లరీ క్లింటన్‌ అని చెప్పడంతో కంగుతిన్న పోలీసులు అమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. దీంతో చికిత్స పొందిన ఆమె, మత్తు దిగిన తరువాత తన అసలు పేరు హోలీ లిన్‌ డొనాహో తెలిపింది. దీంతో తాగి కారు నడిపి పోలీసుల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడమే కాకుండా, తన పేరు తప్పుగా చెప్పినందుకు ఆమెపై కేసు బుక్ చేశారు.

  • Loading...

More Telugu News