: రోడ్డుపై వాహనాలన్నీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగుంటే... ఫైర్ బాల్ లా దూసుకొచ్చి కుప్పకూలిన విమానం.. వీడియో మీరూ చూడండి!


అది వాషింగ్టన్ పరిధిలోని ముకిల్టియో ప్రాంతం. రెడ్ లైట్ పడటంతో వాహనాలన్నీ వరుసగా వచ్చి ఆగుతున్నాయి. అంతలోనే గాల్లో ఓ మెరుపు, ఆపై భారీ శబ్దంతో పేలి, గాల్లోకి మంట, పొగలను విరజిమ్ముతూ దూసుకొచ్చిన విమానం నడి రోడ్డుపై కుప్పకూలింది. ఓ కారు డ్యాష్ క్యామ్ లో ఈ ఘటన అంతా రికార్డయింది. అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఓ ఎయిర్ ఫీల్డ్ నుంచి టేకాఫ్ అయిన విమానం కాసేపటికే కుప్పకూలిందని 'కోమో న్యూస్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

అదృష్టవశాత్తూ, పైలట్ సహా ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని తెలిపింది. కుప్పకూలే ముందు ఓ విద్యుత్ స్తంభం తీగలను, ఆపై కొన్ని కార్లను ఈ విమానం ఢీకొన్నప్పటికీ, ప్రమాద తీవ్రత స్వల్పంగానే ఉంది. విమానం కూలబోతుందన్న సంగతి తనకు తెలిసిపోయిందని, అదృష్టంతోనే ప్రాణాలతో బయటపడ్డానని పైలట్ వ్యాఖ్యానించాడు. ఆ వీడియోను మీరూ చూడండి!

  • Loading...

More Telugu News