: పోస్టుమార్టం పూర్తి... నటుడు ప్రదీప్ మృతి చెందకముందే రక్తస్రావం అయినట్లు నిర్ధారించిన వైద్యులు
హైదరాబాద్ నార్సింగ్ లోని అలకాపురి కాలనీ గ్రీన్ హోమ్స్ లోని అపార్ట్ మెంట్ లో తెలుగు టీవీ నటుడు ప్రదీప్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రదీప్ మృతదేహానికి ఉస్మానియా వైద్యులు పోస్టుమార్టం చేశారు. అతడి మృతదేహంపై రక్తపు మరకలు ఉన్నట్లు, మృతి చెందకముందే రక్తస్రావం అయినట్లు నిర్ధారించారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చెన్నైలో ఉంటున్న ప్రదీప్ తల్లి, సోదరుడు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే పలువురిని ప్రశ్నించి పలు వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి విచారణ జరపనున్నారు.