: ఆఫ్ఘనిస్థాన్‌లోని అమెరికన్ ఎంబసీ ఎదుట శ‌క్తిమంత‌మైన బాంబుల‌తో ఐఎస్ఐఎస్ దాడి.. ఎనిమిది మంది మృతి


ఆఫ్ఘనిస్థాన్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్ర‌వాదుల‌ను అంత‌మొందించ‌డ‌మే ల‌క్ష్యంగా అమెరికా సేన‌లు శ్ర‌మిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, అక్క‌డి అమెరికా ఆర్మీపై ఉగ్ర‌వాదులు విరుచుకుప‌డ్డారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని అమెరికన్ ఎంబసీ ఎదుట ఈ రోజు ఐఎస్ఐఎస్ శ‌క్తిమంత‌మైన బాంబుల‌తో దాడి చేసింది.

ఈ దాడిలో ఎనిమిదిమంది ఆప్ఘ‌నిస్థాన్ పౌరులు మరణించార‌ని, ముగ్గురు యూఎస్ జవాన్లకి తీవ్రగాయాల‌య్యాయ‌ని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ పేలుడు ధాటికి యూఎస్ ఆర్మీకి చెందిన రష్ అవర్ వాహనం ధ్వంస‌మైంద‌ని, అలాగే అక్క‌డి మరో 25 వాహనాలు ధ్వంసం అయ్యాయ‌ని ఐఎస్ఐఎస్ ప్ర‌క‌టించింది. ఈ దాడి తామే చేశాన‌ని చెప్పుకుంది.

  • Loading...

More Telugu News