: ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటాం..బీజేపీని ఓడిస్తాం: లాలూ ప్రసాద్ యాదవ్


వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీహార్ లోని రాజ్ గిరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎన్నికల ప్రణాళికల గురించి ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుని బీజేపీని ఓడిస్తామని, ఇందుకోసం, ఈ ఆగస్టులో భారీ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు.

ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తదితరులను ఆహ్వానిస్తామని చెప్పారు. అంతర్గత విభేదాలు తొలగిపోతే తమ కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై లాలూ విమర్శలు గుప్పించారు. 

  • Loading...

More Telugu News