: హీరోహీరోయిన్ల హాట్ ఫొటోల లీకేజ్ పై వివరణ ఇచ్చిన సుచీలీక్స్ సుచిత్ర
కోలీవుడ్, టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోహీరోయిన్లు క్లోజ్ గా ఉన్న సమయంలో తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి సంచలనం రేకెత్తించింది సింగర్ సుచిత్ర. సుచీ లీక్స్ దెబ్బకు సినీ ప్రపంచం నివ్వెరపోయింది. అయితే, ఈ లీక్స్ గురించి సుచిత్ర తాజాగా వివరణ ఇచ్చింది.
ఈ లీక్స్ కు, తనకు ఏ సంబంధం లేదని సుచిత్ర స్పష్టం చేసింది. తన ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేసి, ఈ పని చేశారని ఆరోపించింది. వాస్తవానికి ఎవరినీ నొప్పించడానికి తాను ఇష్టపడనని చెప్పింది. తన తప్పు కానప్పటికీ... తన వల్ల బాధపడిన సెలబ్రిటీలందరికీ క్షమాపణలు చెబుతున్నానని తెలిపింది. శత్రువునైనా సరే అవమానపరిచే తత్వం తనది కాదని చెప్పింది. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి తనకు ఆరు వారాల సమయం పట్టిందని తెలిపింది. తాను కోలుకోవడానికి తన భర్త, కుటుంబసభ్యులే కారణమని చెప్పింది. చెన్నైకి చెందిన ఓ సంస్థ తన ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.