: దర్శకుడు రాజమౌళిపై పోలీసులకు ఫిర్యాదు!


‘బాహుబలి-2’లో తమ మనోభావాలను దెబ్బ తీసేలా ఓ డైలాగ్ ఉందని, ఆ డైలాగ్ ను తొలగించాలని ఆరెకటిక పోరాట సమితి నిన్న హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళిపై ఈ రోజు హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, ఆరెకటిక పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ, ఈ చిత్రంలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ ..‘కటిక చీకటి’ అనే డైలాగ్ చెప్పారని, అందులో కటిక అనే పదం తమను కించపరిచేలా ఉందని ఆరోపించారు. అయితే, పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది. కాగా, ఈ విషయమై సెన్సార్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News