: గవర్నర్ నరసింహన్ పదవీకాలం తాత్కాలిక పొడిగింపు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీ కాలం నేటితో ముగిసిన విషయం తెలిసిందే. ఆయనను మరో విడత కొనసాగిస్తారా? అనే అంశంపై స్పష్టత వచ్చింది. గవర్నర్ నరసింహన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా పొడిగించింది. తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగాలని కేంద్ర హోం శాఖ నుంచి నరసింహన్‌కు మౌఖిక ఆదేశాలు వచ్చాయి. ఈఎస్ఎల్ నరసింహన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ గవర్నర్ గా సేవలందించిన ఆయనను కేంద్ర ప్రభుత్వం జూన్ 2, 2014 నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.