: 'టిఫిన్' కేబినెట్ నిర్వహించిన మధ్యప్రదేశ్ సీఎం!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తన కేబినెట్ ను వినూత్న రీతిలో సమావేశ పరిచారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రులందరికీ స్వయంగా ఆయనే అల్పహారం (టిఫిన్) వడ్డించారు. అల్పాహారం తింటూనే పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించుకున్నారు. అనంతరం, మంత్రులు మాట్లాడుతూ, ఈ తరహా సమావేశం తమకు బాగా నచ్చిందని చెప్పారు.