: మరింత బిగిసిన ఉచ్చు.. టీవీవీ దినకరన్ పై మనీలాండరింగ్ కేసు నమోదు
జయలలిత మృతితో ఖాళీ అయిన తమిళనాడులోని ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో రెండాకుల గుర్తు తమ వర్గానికే కేటాయించాలని కోరుతూ ఎన్నికల సంఘం అధికారులకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారన్న కేసులో టీవీవీ దినకరన్ అరెస్టైన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రస్తుతం దినకరన్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అధికారులు ఈ కేసులో దర్యాప్తును వేగంగా కొనసాగిస్తున్నారు. మరోపక్క టీవీవీ దినకరన్‌పై ఈడీ ఈ రోజు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. దీంతో ఆయన మరిన్ని కష్టాల్లో పడ్డారు.