: యూపీ సీఎం యోగి మరో నిర్ణయం.. పూల స్వాగతాలు వద్దని పార్టీ నేతలకు సూచన
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి పూల ఆహ్వానాలకు స్వస్తి పలకాలని పార్టీ నేతలు, కార్యకర్తలను ఆదేశించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని, ఇక నుంచి ఆర్భాటాలు లేకుండా స్వచ్ఛమైన, పరిశుభ్రమైన ఆహ్వానాలు పలకాలని నేతలకు సూచించారు. తనను సాధారణంగా ఆహ్వానిస్తే చాలని, పూల దండలు, పూలు అవసరం లేదని తేల్చి చెప్పారు. రెండు రోజులపాటు జరగనున్నబీజేపీ రాష్ట్రస్థాయి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ప్రారంభం సందర్భంగా సోమవారం లక్నోలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న యోగి తాజా నిర్ణయంతో మరోమారు ప్రజల మనసులు దోచుకున్నారు.