: ఐపీఎల్ లో ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన తొలి జట్టు ముంబై ఇండియన్స్!


ఐపీఎల్‌ సీజన్-10లో ‌ప్లే ఆఫ్‌ కు అర్హత సాధించిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. గత రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతో చివరి బంతి వరకు సాగిన ఉత్కంఠ పోరులో మరో బంతి మిగిలి ఉండగానే ఫోర్ కొట్టి, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో ఈ సీజన్ లో 8 మ్యాచ్ లలో గెలిచిన ఐపీఎల్ జట్టుగా ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం పొంది, ప్లే ఆఫ్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ తరువాతి స్థానాల్లో వరుసగా... కోల్‌ కతా నైట్‌ రైడర్స్ (10 మ్యాచ్‌లలో 7 గెలుపు), సన్‌ రైజర్స్ హైదరాబాద్ (10 మ్యాచ్‌లలో 6 గెలుపు) ఉన్నాయి. 

  • Loading...

More Telugu News