: ‘జియో’ను అత్యధికంగా ఏ రాష్ట్ర ప్రజలు వాడుతున్నారో తెలుసా?
టెలికం రంగంలోకి ఎంట్రీ ఇస్తూనే ఎవ్వరూ ఊహించనంత మంది వినియోగదారులను సొంతం చేసుకున్న జియో... తమ సిమ్ కార్డులను అత్యధికంగా ఏయే ప్రాంతాల్లో వాడుతున్నారో తెలిపింది. అందులో ఆంధ్రప్రదేశ్ 90.4 లక్షల మంది జియో ఖాతాదారులతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానంలో తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో 80.1 లక్షల మంది వినియోగదారుల చొప్పున జియోను వాడుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
జియో యూజర్ల సంఖ్య ఈశాన్య భారతంతో అత్యల్పంగా ఉంది. అక్కడ మొత్తం 90 వేల మంది మాత్రమే జియోను వాడుతున్నారు. ఇక మహారాష్ట్ర, ఢిల్లీలో 70.7 లక్షల మంది చొప్పున జియో వినియోగదారులు ఉన్నారు. అయితే, మహారాష్ట్ర రాజధాని ముంబై నుంచే 50 లక్షల మంది జియోను వాడుతున్నారు. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 6.9 మిలియన్ల యూజర్లు ఉన్నట్లు జియో ప్రతినిధులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 6.1 మిలియన్ల మంది జియో వాడుతున్నారు.