: శ్రియా భూపాల్ తో కలిసి పార్టీ చేసుకున్న అల్లు శిరీష్!


న‌టుడు అల్లు శిరీష్, జీవీకే కుటుంబానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్ పార్టీలో మునిగితేలిపోయారు. వీరు పార్టీలో ఉండ‌గా తీసిన ప‌లు ఫొటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వీరి మేట‌ర్ హాట్ టాపిక్‌గా మార‌డానికి కార‌ణం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అక్కినేని అఖిల్, శ్రియా భూపాల్ లకు నిశ్చితార్థం కూడా జ‌రిగి అనంత‌రం పెళ్లి ర‌ద్ద‌యిపోయిన విష‌యం తెలిసిందే.

 అనంత‌రం శ్రియా భూపాల్ ఓ ఎన్‌ఆర్‌ఐను పెళ్లిచేసుకోవడానికి సిద్ధపడిందట. అయితే, ఇప్పుడు శిరీష్‌తో పార్టీ చేసుకుంటూ కనిపించడంతో శ్రియా భూపాల్ మ‌ళ్లీ వార్త‌ల్లోకెక్కింది. అల్లు, జీవీకే కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉండ‌డం, వీరి ఇళ్లలో జరిగే అన్ని శుభకార్యాల్లో రెండు ఫ్యామిలీలు పాల్గొంటుండ‌డంతో శిరీష్, శ్రియాలు పార్టీలో మామూలుగానే క‌లుసుకున్నార‌ని ప‌లువురు అంటున్నారు. శిరీష్ కూడా ఈ అంశంపై ట్వీట్ చేస్తూ త‌న‌ బెస్ట్ ఫ్రెండ్ శరత్ రెడ్డి, బేబీ సిస్టర్ శ్రియా‌తో పార్టీలో ఉన్న‌ట్లు పేర్కొన్నాడు. ఈ సంద‌ర్భంగా తీసుకున్న ఓ ఫొటోను పోస్ట్ చేశాడు.


  • Loading...

More Telugu News