: లోకేష్ లా 'పప్పు'లా జగన్ తయారు కాగలరా?: మాజీ మంత్రి పార్థసారధి వ్యాఖ్యలకు నవ్వుకున్న జగన్
నల్లపాడులో వైఎస్ జగన్ రైతుదీక్ష సభలో మాజీ మంత్రి, వైకాపా నేత పార్థసారధి ప్రసంగం నవ్వులు పూయించింది. ఇటీవల ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, తమ యువ నేత లోకేష్ కు జగన్ పోటీ కాదని వ్యాఖ్యానించారని గుర్తు చేసిన పార్థసారధి, "జగనంట... ఏ రోజుకీ లోకేష్ కు సమానం కాదంట. ఎట్లా సమానమవుతారండీ? నాలాగా, లోకేష్ లాగా, పప్పులా జగన్ తయారుకాగలరా? అని అడుగుతా ఉన్నాను. కాలేడు. ఏనాడైనా సరే జగన్ మోహన్ రెడ్డి మైకు పుచ్చుకుని, ఈ రాష్ట్రంలో తాగునీరు లేకుండా చేయగలనని చెప్పారా? ఏరోజైనా సరే, జగన్ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని చెప్పగలరా? అని అడుగుతా ఉన్నాను. కరెక్టే సోమిరెడ్డి గారూ... ఏరోజూ లోకేష్ కు జగన్ సమానం కాదని చెబుతా ఉన్నాను. జగన్ కీ లోకేష్ కీ నక్కకీ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. లోకేష్ ను కించపరిచేందుకుకే సోమిరెడ్డి జగన్ తో పోలికను తెచ్చినట్టు అనుమానంగా ఉంది" అని ఎద్దేవా చేశారు. ఆయన ప్రసంగానికి వేదికపై కూర్చున్న జగన్ సహా అందరు వైకాపా నేతలూ నవ్వుకుంటూ కనిపించడం విశేషం.