: ప్రభాస్, అనుష్క, రానా, రమ్య... అద్భుతం చేసి చూపారు: నాగార్జున


బాహుబలిని ప్రశంసల్లో ముంచెత్తుతున్న ప్రముఖుల్లో హీరో అక్కినేని నాగార్జున కూడా చేరిపోయారు. ఆ సినిమా చూసిన నాగ్, అరగంట క్రితం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క రానా, రమ్యకృష్ణలు అద్భుతం చేశారని పొగిడారు. ఐదేళ్లపాటు బాహుబలి చిత్రం కోసం వారు ఎంతో అంకితభావాన్ని చూపారని అంటూ, చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీని ఉంచారు. నిమిషాల్లో ఈ ట్వీట్ వైరల్ అయింది. ఇక ఈ ట్వీట్ ను చూసిన వెంటనే రాజమౌళి సైతం స్పందించారు. బాహుబలి టీం తరఫున నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపారు.

  • Loading...

More Telugu News