: విలీనంపై తొలిసారి పెదవి విప్పిన పళనిస్వామి.. వస్తే రానీ, లేకుంటే లేదు అంటూ నైరాశ్యం!
గత కొన్ని రోజులుగా హల్చల్ చేస్తున్న విలీనం వార్తలపై తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి తొలిసారి పెదవి విప్పారు. సేలంలో ఆదివారం నిర్వహించిన అన్నాడీఎంకే (అమ్మ) నిర్వాహకుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పన్నీర్ వర్గంపై విమర్శలు గుప్పించారు. 'చర్చలకు వస్తే రానీ, లేకుంటే లేదు' అంటూ ఆయన తేల్చి చెప్పారు. విలీనానికి కొందరు కావాలనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. పన్నీర్ వర్గం తొలుత భేషరతుగా చర్చలకు అంగీకరిస్తున్నట్టు చెప్పిందని, తర్వాత షరతులు విధించిందని అన్నారు. ఆ వర్గం ద్వంద్వ వైఖరికి ఇది నిదర్శనమన్నారు. చర్చలకు వారు వచ్చినా, రాకున్నా తమకొచ్చిన నష్టమేమీ లేదని పళనిస్వామి కుండబద్దలు గొట్టారు.