: తియ్యని మాటలతో ఎంపీకి వల.. ఆపై ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్.. ఢిల్లీలో సంచలనం


ఎంపీతో పరిచయం పెంచుకున్న ఓ యువతి ఆపై ఆయనను ఇంటికి ఆహ్వానించి, మత్తుమందు ఇచ్చి బ్లాక్‌మెయిల్‌కు దిగిన ఘటన ఢిల్లీలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. యువతి వేధింపులపై ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ ప్రత్యేక పోలీస్ కమిషనర్ ముకేశ్ మీనా కథనం ప్రకారం.. ఆపదలో ఉన్న తనకు సాయం చేయాలంటూ ఓ మహిళ ఎంపీని కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఆపై ఎంపీని ఘజియాబాద్‌లోని ఇంటికి ఆహ్వానించిన ఆమె కూల్‌ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చింది.

బాధిత ఎంపీ స్పృహ తప్పాక అతడితో సన్నిహితంగా ఉన్నట్టు అభ్యంతరకరంగా ఉండే ఫొటోలు, వీడియో తీసింది. వాటిని ఎంపీకి చూపించి రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేదంటే రేప్ కేసు పెడతానని బెదిరించింది. దీంతో ఏం చేయాలో పాలుపోని ఎంపీ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా క్రైం బ్రాంచ్ బృందంతో దర్యాప్తు చేస్తున్నట్టు కమిషనర్ ముకేశ్ మీనా తెలిపారు. ఇదో ముఠా పని అని ఆయన పేర్కొన్నారు. ఈ ముఠాకు అందమైన మహిళలు నేతృత్వం వహిస్తారని ఆయన వివరించారు. గతేడాది కూడా ఇలాగే ఎంపీ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News