: వీరాభిమానం.. సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ విగ్రహం ఏర్పాటు!
కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ వీరాభిమాని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ ఈ విగ్రహాన్ని పూరీ తనయుడు ఆకాష్ తో ఆవిష్కరింపజేశాడు. అనంతరం, విలేకరులతో ఆకాష్ మాట్లాడుతూ, ఒక సినీ డైరెక్టర్ కు విగ్రహం ఏర్పాటు చేయడం అరుదైన సంఘటన అని, తన తండ్రి విగ్రహం ఏర్పాటు చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. తన తండ్రిపై అభిమానంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన కొండాపూర్ ప్రజలకు రుణపడి ఉంటానని, ఈ గ్రామం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నాడు. ఈ సందర్భంగా పూరీ అభిమాని ప్రభాకర్ కు ఆకాష్ ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపాడు.