: రైతులారా! రేపు, ఎల్లుండి మిర్చి తీసుకురావద్దు: గుంటూరు యార్డు చైర్మన్ సుబ్బారావు
గుంటూరు మిర్చి యార్డుకు రేపు, ఎల్లుండి సెలవు దినాలుగా ప్రకటించామని యార్డు చైర్మన్ సుబ్బారావు పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ రెండు రోజుల్లో రైతులు మిర్చి తీసుకువచ్చినా అనుమతించమని, ఇప్పటికే వచ్చిన మిర్చితో యార్డు పూర్తిగా నిండిపోయిందని అన్నారు. జూన్ 30 వరకు మిర్చికి అదనపు ధర పథకం ఉంటుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.