: మనకు తెలిసిన బాహుబలి ఒకరే.. ఆయనే మోదీ!: వెంకయ్యనాయుడు


‘బాహుబలి-2’ సినిమాపై సర్వత్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘మనకు తెలిసిన బాహుబలి ఒకరే.. భారత ప్రధాన మంత్రి మోదీ.... రెండోది సినిమా ‘బాహుబలి’. బాహుబలి అంటే బహుముఖమైనటువంటి బలం, ప్రజ్ఞావిశేషాలు, ఆలోచనలతో భారత దేశాన్ని బహుముఖంగా వికసింపజేయాలని మోదీ ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని ప్రజలు హర్షిస్తున్నారు.. ఆయన వెంట నడుస్తున్నారు’ అని మోదీపై వెంకయ్య ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News