: దర్శకుడు విశ్వనాథ్ ను అభినందించిన వెంకయ్యనాయుుడు
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ ను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభినందించారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని విశ్వనాథ్ నివాసానికి వెంకయ్యనాయుడు వెళ్లారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వనాథ్, వెంకయ్యనాయుడు కాసేపు ముచ్చటించారు. కాగా, వెంకయ్యనాయుడితో పాటు తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా ఉన్నారు.