: వినోద్ ఖన్నాకు బదులు కాంబ్లీకి నివాళి!..నెటిజన్లపై మండిపడుతున్న మాజీ క్రికెటర్
ఒకే పేరున్నవ్యక్తుల కారణంగా నెటిజన్లు తికమక పడిన సంఘటనలు ఇటీవలి కాలంలో చాలానే ఉన్నాయి. తాజాగా, గత గురువారం మృతి చెందిన బాలీవుడ్ సీనియర్ నటుడు వినోద్ ఖన్నాకు పలువురు నెటిజన్లు నివాళులర్పించారు. అయితే, కొందరు నెటిజన్లు పొరపాటు పడ్డారు. వినోద్ ఖన్నాకు బదులు టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి నివాళులర్పించారు. దీంతో, కాంబ్లీ ఘాటుగా స్పందిస్తూ ట్వీటు చేశాడు. ‘వినోద్ ఖన్నా లాంటి గొప్పనటుడికి బదులు నా పేరు వాడుతున్నారు. దేవుడు అలాంటి వారిని శిక్షిస్తాడు. సిగ్గులేకపోతే సరి’ అంటూ మండిపడ్డాడు.