: బాహుబలిపై ఉన్న శ్రద్ధ ప్రజలపై ఏది?: కేసీఆర్ సర్కారును ఏకేసిన పొన్నం ప్రభాకర్


బాహుబలి సినిమాపై ఉన్న శ్రద్ధ, ఆ చిత్రాన్ని చూడాలన్న ఉత్సుకత పాలనపైగానీ, పేదల సమస్యపైగానీ అటు కేసీఆర్ ప్రభుత్వం కాని, ఇటు అధికారులు కాని చూపడం లేదని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఆ సినిమా టికెట్లను పొందేందుకు ఉన్నతాధికారులు చూపిన శ్రద్ధలో పదోవంతు రైతుల బాగోగులపై చూపినా, ఆత్మహత్యలు లేని తెలంగాణ వచ్చుండేదని అన్నారు.

సినిమా చూసి వచ్చి పొగడ్తలు కురిపిస్తున్న అమాత్యులు, అదే సమయంలో రోడ్డెక్కిన మిర్చి రైతుల సమస్యను విపక్షాలపైకి నెట్టి పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం రైతులపై కేసులు పెడితే, వారికి అండగా కాంగ్రెస్ నిలుస్తుందని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి వెంటనే అసెంబ్లీని ఏర్పాటు చేయాలని పొన్నం డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News