: ఇది తుపాను కాదు, అగ్నిపర్వతం... భూకంపాలతో కూడిన టైఫూన్: రాంగోపాల్ వర్మ
బాహుబలి చిత్ర నిర్మాత శోబు యార్లగడ్డ ఓ ట్వీట్ పెడుతూ, అమెరికాలో బాహుబలి తుపానును సృష్టిస్తోందని వ్యాఖ్యానించగా, దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. "సార్, బాహుబలి-2ను కేవలం తుపానుగా చెప్పడం అవమానకరం. ఇది అగ్నిపర్వతం బద్దలై, దాని కారణంగా వచ్చిన చిన్న చిన్న భూకంపాలతో పాటు వచ్చిన టైఫూన్ వంటిది" అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిప్రాయపడ్డాడు. గత రాత్రి 12 గంటల సమయంలో ఈ ట్వీట్ పెట్టగా ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అంతకుముందు హైదరాబాద్ ప్రసాద్స్ ఐమాక్స్ ముందు చిత్రం టికెట్ల కోసం అభిమానుల క్యూ వీడియోను ప్రస్తావిస్తూ, ఈ తరహాలో థియేటర్ల ముందు టికెట్ల కోసం క్యూ కట్టడం తనకు గుర్తులేదని చెప్పాడు.
Sir calling BB2 just a storm is insulting it ..it's a typhoon having intercourse with a volcano to produce lots of baby earthquakes https://t.co/c2AohB8cdq
— Ram Gopal Varma (@RGVzoomin) April 29, 2017