: ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కోరికను మూడు నిమిషాల్లో తీర్చిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు


ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోరిన ఓ చిన్న కోరికను రైల్వే మంత్రి సురేష్ ప్రభు మూడంటే మూడే నిమిషాల్లో తీర్చారు. పూరి - కోణార్క్ పట్టణాల మధ్య కొత్త రైల్వే లైన్ ను మంజూరు చేయాలని, ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో సగ భాగాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమని చెబుతూ, సురేష్ ప్రభు అధికారిక ట్విట్టర్ ఖాతాకు నవీన్ పట్నాయక్ ట్వీట్ పంపారు. పర్యాటకాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ లైన్ ఉపకరిస్తుందని చెప్పారు.

ఆపై మూడు నిమిషాల్లోనే నవీన్ పట్నాయక్ కు సమాధానం లభించింది. కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలుపుతున్నానని, సంతకాలు చేసేందుకు ఇవాళైనా రెడీగా ఉన్నామని ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకుని ప్రాజెక్టులను ముందుకు తీసుకు వెళ్లాలన్నదే తమ అభిమతమని ఆయన చెప్పారు. దీంతో తన ట్విట్టర్ ఖాతాను ఆయన ఎంత వేగంగా ఫాలో అవుతున్నారన్న విషయం మరోసారి స్పష్టమైంది.

  • Loading...

More Telugu News