: ఇక 'అవతార్' మాయాజాలం... వచ్చే నాలుగు భాగాల విడుదల తేదీలను ప్రకటించిన జేమ్స్ కామెరూన్


అవతార్... 2009లో వచ్చిన ఈ చిత్రం ఎంత పెద్ద సూపర్ హిట్టయిందో అందరికీ తెలిసిందే. విజువల్ వండర్ గా, నిలిచి, ఆస్కార్ అవార్డులను అందుకోవడమే కాకుండా, తెరపై ఎంతటి మాయాజాలాన్ని చూపవచ్చో ప్రపంచానికి చెప్పిన చిత్రమిది. ఆపై ఈ చిత్రం సీక్వెల్ సిరీస్ ను ప్రారంభించినట్టు దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రకటించి, పనిలో దిగారు కూడా.

 ఇక ఈ చిత్రం మరో నాలుగు భాగాలను సిద్ధం చేస్తున్నామని తాజాగా వెల్లడించిన ఆయన, వాటి విడుదల తేదీలను ప్రకటించారు. 2020 డిసెంబరు 18న ‘అవతార్‌–2’ విడుదలవుతుందని, 2021 డిసెంబర్‌ 17న మూడో భాగం, 2024 డిసెంబర్‌ 20న నాలుగో భాగం, 2025 డిసెంబరు 19న తుది భాగం విడుదలవుతాయని చెప్పారు. ఈ విడుదల తేదీలన్నీ క్రిస్మస్ పండగ సీజన్ లోనే ఉండటం విశేషం.

  • Loading...

More Telugu News