: సినిమా అంటే ఇది... బాహుబలిపై కేంద్ర మంత్రి వెంకయ్య ప్రశంసలు
టాలీవుడ్ మూవీగా వచ్చి సినీ ప్రపంచానికి తెలుగోడి సత్తా ఏంటన్నది చాటుతున్న 'బాహుబలి: ది కన్ క్లూజన్'పై పొగడ్తలు కురిపించిన వారిలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా చేరిపోయారు. ఈ చిత్రాన్ని నిన్న చూసిన ఆయన, సినిమాపై తన అభిప్రాయాలను వెల్లడించారు. భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత బాహుబలి-2కి దక్కిందని ఆయన అన్నారు. ప్రాంతీయ భాషా చిత్రంగా వచ్చినా మన గొప్పతనాన్ని విదేశాలలో చాటి చెప్పేలా మూవీ యూనిట్ సినిమాను తెరకెక్కించిందని ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. కాగా, శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మెదటి రెండు రోజుల్లో రూ. 220 కోట్లకు పైగా సాధించినట్టు ట్రేడ్ పండితులు చెబుతున్నారు.