: గోవా, కర్ణాటకల‌కు కొత్త కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిలు


ఇటీవల జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇత‌ర పార్టీల క‌న్నా ఎక్కువ స్థానాలు సంపాదించిన‌ప్ప‌టికీ మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేక‌పోయిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆ రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఆ రాష్ట్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేక‌పోయిన త‌మ అధిష్ఠానంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేపథ్యంలో,  గోవాతో పాటు క‌ర్ణాట‌క‌లోనూ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌ను ఆ పార్టీ అధిష్ఠానం ఆ బాధ్య‌త‌ల నుంచి తొలగించింది. ఆయన స్థానంలో గోవా కాంగ్రెస్ ఇన్‌ఛార్జీగా చెల్లా కుమార్‌ను, కర్ణాట‌క కాంగ్రెస్ ఇన్ చార్జీగా కే.సీ. వేణుగోపాల్‌ను నియమించింది.

  • Loading...

More Telugu News