: భారత్లోకి వచ్చేసిన పాకిస్థాన్ బాలుడు.. పాక్ అధికారులకు అప్పగించిన బీఎస్ఎఫ్!
ఓ పాకిస్థాన్ బాలుడు (15) సరిహద్దు దాటి భారత భూభాగంలోని ప్రవేశించిన ఘటన పంజాబ్లోని అబోహర్ సెక్టార్ వద్ద చోటు చేసుకుంది. ఆ బాలుడిని గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు అతడిని తిరిగి పాకిస్థాన్ అధికారులకు అప్పగించారు. ఆ బాలుడు పొరపాటుగా సరిహద్దు దాటినట్లు తెలుస్తోంది. ఆ బాలుడు పాకిస్థాన్లోని కసూర్ జిల్లా రజక్ ప్రాంతానికి చెందిన వాడుగా అధికారులు తెలుసుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పాకిస్థాన్ నుంచి ఆరుగురు వ్యక్తులు సరిహద్దులు దాటి భారత్లోకి వచ్చారు. పొరపాటుగా వచ్చిన వారిని బీఎస్ఎఫ్ పట్టుకొని తిరిగి పాక్కు అప్పగిస్తోంది.