: నంద్యాల ఉప ఎన్నిక వివాదంపై ముగిసిన టీడీపీ ముఖ్య నేతల చర్చలు.. చంద్రబాబు వద్దకు పయనం


కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఎంపిక‌పై ఏర్పడ్డ‌ వివాదానికి తెర‌దించేందుకు మంత్రులు క‌ళా వెంక‌ట్రావు, నారాయ‌ణ‌ ఈ రోజు మంత్రి అఖిల‌ప్రియతో చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. ఈ భేటీలో నంద్యాల‌ పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి, ఎన్ఎండీ ఫ‌రూఖ్ లు కూడా పాల్గొన్నారు. ఈ స‌మావేశం ముగిసిన అనంత‌రం టీడీపీ నేత‌లు సీఎం చంద్ర‌బాబు వ‌ద్ద‌కు బ‌య‌లుదేరారు. ఈ అంశంలో తుది నిర్ణ‌యాన్ని త‌మ పార్టీ అధినేత, సీఎం చంద్ర‌బాబుకే వారు వ‌దిలేశారు. మ‌రోవైపు శిల్పా మోహ‌న్ రెడ్డి హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి విజ‌య‌వాడ‌కు చేరుకున్నారు. ఈ రోజు జ‌రిపిన భేటీ వివరాలను చంద్ర‌బాబుకి క‌ళా వెంక‌ట్రావు వివ‌రించ‌నున్నారు.

  • Loading...

More Telugu News