: 100 రోజుల పాలనలో 489 ట్వీట్లు చేసిన డొనాల్డ్ ట్రంప్


అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్య‌త‌లు చేప‌ట్టి 100 రోజులు పూర్త‌యిన విష‌యం తెలిసిందే. తన పాలనకు సంబంధించిన పలు అంశాలను తెలపడానికి ట్రంప్ ట్విట్ట‌ర్ ను బాగానే వాడేస్తున్నారు. ఈ 100 రోజుల పాలనలో భాగంగా ట్రంప్ 489 ట్వీట్లు చేశార‌ని థామస్ రాయిటర్స్ సంస్థ పేర్కొంది. అంతేకాదు, వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ వాడిన తొలి అమెరికా ప్రెసిడెంట్ కూడా ఆయ‌నేన‌ని తెలిపింది.

డొనాల్డ్ ట్రంప్ ట్విట్ట‌ర్ ఖాతాను 2009వ సంవ‌త్స‌రంలో తెర‌చారు. అప్పటి నుంచి ట్రంప్ ఇప్పటివరకు మొత్తం 34,800 ట్వీట్లను చేశారు. మీడియాపై మండిప‌డే డొనాల్డ్ ట్రంప్‌కు సోష‌ల్ మీడియా సైట్ ట్విట్టర్ అంటే మాత్రం ఎంతో ఇష్టం. ప్రస్తుతం ఆయ‌న‌కు అందులో 28.4 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ట్రంప్ రోజుకు కనీసం ఐదు ట్వీట్లయినా చేస్తున్నారు.

  • Loading...

More Telugu News