: అసంతృప్తిలో 34 మంది ఆప్ ఎమ్మెల్యేలు.. కేజ్రీని ప‌ద‌వి నుంచి దించేయడం ఖాయం!: బీజేపీ నేత బగ్గా


ఇటీవ‌ల నిర్వ‌హించిన ఢిల్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తీరుపై ప‌లువురి నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆప్ నేత‌లు ఆయ‌న‌పై అలిగార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో 34 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామాకు పట్టుపట్టినట్లు ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి పాల్‌ ఎస్‌ బగ్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. వారంతా కేజ్రీవాల్‌ పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ఆయనను పదవి నుంచి దించేయడం ఖాయమని ఆయ‌న వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఆప్‌ కీలక నేత కుమార్‌విశ్వాస్ ను వారంతా ముఖ్యమంత్రిగా ఎన్నుకోబోతున్నార‌ని అన్నారు. దీనిపై స్పందించిన కుమార్ విశ్వాస్ మాత్రం బీజేపీ నేత వ్యాఖ్యల‌ను ఖండించారు.

  • Loading...

More Telugu News