: విద్యాసాగర్‌రావు పార్థివదేహాన్ని చూసి ఉద్వేగానికి గురై.. కంటతడి పెట్టిన సీఎం కేసీఆర్
ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. ఆయన నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్... విద్యాసాగర్‌రావు పార్థివదేహాన్ని చూసి ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించి, ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, ఎంపీ కవిత కూడా ఉన్నారు. మరోవైపు తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు పలువురు నేతలు విద్యాసాగర్ రావుకి నివాళులర్పించారు.