: కళా వెంకట్రావుతో మంత్రి భూమా అఖిలప్రియ సమావేశం.. నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిపై కీలక చర్చ
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక వివాదాన్ని తెరదించేందుకు టీడీపీ కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే. విజయవాడలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో మంత్రి భూమా అఖిల ప్రియ సమావేశం అయ్యారు. ఉప ఎన్నికలో టీడీపీ నుంచి అభ్యర్థిని ఎంపిక చేసే అంశంపై వారు చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఎన్ఎండీ ఫరూఖ్ లు కూడా పాల్గొన్నారు. ఏ స్థానంలోనైనా అభ్యర్థి మరణిస్తే అదే కుటుంబానికి ఉప ఎన్నికల టికెట్ ఇస్తున్నారన్న విషయాన్ని అఖిల ప్రియ సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.