: రేవంత్ రెడ్డి సోదరుని కుమార్తె మృతి... ఖమ్మం పర్యటన నుంచి వెనుదిరిగిన రేవంత్


నిన్న ఖ‌మ్మం జిల్లా మార్కెట్టు యార్డులో గిట్టుబాటు ధ‌ర‌లేక రైతులు విధ్వంసానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ  ఘ‌ట‌న‌లో మార్కెట్ యార్డులోని ప‌లు వ‌స్తువుల‌ను కూడా రైతులు త‌గుల‌బెట్టారు. ఈ నేప‌థ్యంలో వారిపై లాఠీ ఛార్జీ కూడా చేయాల్సి వ‌చ్చింది. అయితే, తీవ్ర ఆందోళన‌లో ఉన్న స‌ద‌రు రైతుల‌ను ప‌రామ‌ర్శించడానికి తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఈ రోజు ఖ‌మ్మం జిల్లాకు వెళ్లారు. అయితే, అదే స‌మ‌యంలో త‌న‌ సోదరుడు తిరుపతి రెడ్డి కుమార్తె మృతి చెందింద‌న్న వార్త తెలియడంతో రేవంత్ రెడ్డి మ‌ళ్లీ ఖమ్మం నుంచి వెనుతిరిగారు.

  • Loading...

More Telugu News