: డబ్బింగ్ సినిమాల్లో 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' వసూళ్ల రికార్డు!
డబ్బింగ్ సినిమాల చరిత్రలో రికార్డులను 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా తిరగరాసింది. ఇంతవరకు అంతంత మాత్రంగా ఉన్న డబ్బింగ్ సినిమాల వసూళ్లకు 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సరికొత్త భాష్యం చెప్పింది. భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. బాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతున్న లెక్కల ప్రకారం, డబ్బింగ్ సినిమాగా విడుదలైన 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' స్ట్రెయిట్ సినిమా స్థాయిలో వసూళ్లను సాధిస్తోందని చెబుతున్నారు.
విడుదలైన తొలిరోజే రికార్డు స్థాయి వసూళ్లు సాధించిందని వారు పేర్కొంటున్నారు. గతంలో 'బాహుబలి-1: ద బిగెనింగ్' వంద కోట్ల క్లబ్ లో చేరిన డబ్బింగ్ సినిమాగా స్థానం సంపాదించుకోగా... 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ఆ రికార్డులను తిరగరాయనుందని చెబుతున్నారు. దీంతో భారతీయ సినీ చరిత్రలో విడుదలైన తొలిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' నిలిచిందని, అంతే కాకుండా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.