: మావోయిస్టుల తలకు వెల... ఒక్కోనేత తలకు కోటి ధర... చుట్టుముట్టిన ప్రభుత్వ వ్యూహం!


ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు జరిపిన దాడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి. దీంతో జవాన్లను మట్టుబెట్టిన మావోయిస్టులను వీలైనంత వేగంగా అంతమొందించేందుకు నడుంబిగించాయి. అష్టదిగ్బంధనం తరహాలో సుక్మా జిల్లాలోని చింతల్‌ నార్‌, చింతగుప్ప, బుర్కాపాల్‌ తదితర గ్రామాల ప్రాంతాలను గతంలో ఉన్న పోలీసు బలగాలకు తోడు అదనపు బలగాలు చేరుకుని జల్లెడ పడుతున్నాయి. వీరి లక్ష్యం మావోయిస్టు పార్టీలో పని చేసున్న 68 కేడర్లను మట్టుబెట్టడమే అని తెలుస్తోంది.

కుదిరితే ప్రాణాలతో పట్టుకోవడం, లేదా మట్టుబెట్టడం వీరి లక్ష్యం. పూర్తి స్థాయి ఆదేశాలతో ఛత్తీస్‌ గఢ్‌ లో అడుగుపెట్టిన బలగాలకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టుల తలలకు వెల కట్టింది. ఈ మేరకు సుక్మా జిల్లాలోని గ్రామాల్లో ప్రచారం మొదలు పెట్టింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పోస్టర్లు అతికించింది. ఇందులో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మొదలు కేకేఎస్‌ సభ్యుల పేర్ల వరకు ఉండడం విశేషం. కేంద్ర కమిటీలో ఒక్కో నేత తలకు కోటి రూపాయల వెల కట్టిన ప్రభుత్వం...కేకేఎస్‌ కేడర్ కింది స్థాయి సభ్యుల్లో ఒక్కో తలకు లక్ష రూపాయలుగా నిర్ణయించింది. అంతే కాకుండా కిల్లర్ వీరప్పన్ ను మట్టుబెట్టిన ఐపీఎస్ అధికారిని బస్తర్ రేంజ్ లో నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News