: నీ అబ్బ అధికారంతో మంత్రివయ్యావు.. విర్రవీగడం తగ్గించు: కేటీఆర్‌పై రేవంత్ ఫైర్
వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన టీడీపీ ప్రజా పోరు సభలో టీడీపీ-టీఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని మంత్రి అయిన కేటీఆర్ విర్రవీగుతున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. ‘‘నీ అబ్బ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రిని అయ్యానని విర్రవీగుతున్నావేమో, మీరు సభ పెట్టిన చోటే మేమూ పెట్టాం. ఈ పాటికే టీడీపీ సత్తా ఏమిటో అర్థమై ఉంటుంది. మీకు దమ్ముంటే, సత్తా ఉంటే.. ఇక్కడే మేం సభ పెట్టిన ప్రదేశంలోనే ఇంత పెద్ద సభ పెట్టాలి’’ అని రేవంత్ సవాల్ విసిరారు. కాగా, వర్షం పడుతున్నా లెక్కచేయకుండా జనాలు రేవంత్ ప్రసంగం కోసం ఎదురుచూడడం గమనార్హం.