: బాహుబలి-2’లో భయానక దృశ్యాలు సెన్సార్ అయ్యాయి!


ఈ రోజు విడుదలైన ‘బాహుబలి-2’ చిత్రంలో భయానకమైన కొన్ని సన్నివేశాలను సెన్సార్ చేశారు. ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశం సమయంలో తలలు తెగనరకడం లాంటి దృశ్యాలపై సెన్సార్ కత్తెర పడింది. ఈ సినిమాకి సంబంధించి ‘కట్స్’ సూచిస్తూ హైదరాబాద్ లోని సీబీఎఫ్ సీ రీజనల్ అధికారి పీవీఆర్ రాజశేఖరం జారీ చేసిన ఉత్తర్వుల కాపీ ఒకటి మీడియాకు దొరికింది.

ఈ కాపీ ప్రకారం, రానా, ప్రభాస్ ల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని దృశ్యాలు, మిగతా అభ్యంతరకర సన్నివేశాలను కట్ చేశారు. అయితే, కట్ అయిన ఆయా సన్నివేశాల కారణంగా ఈ చిత్రం నిడివి తగ్గకుండా ఉండేందుకు రాజమౌళి మళ్లీ షూటింగ్ జరిపి కొన్ని సన్నివేశాలను వాటి స్థానంలో కలిపారు.

  • Loading...

More Telugu News