: ప్రదర్శనకు ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా ధరించిన ఆభరణాలు.. త్వరలోనే విక్రయం
బాహుబలి సినిమాలో నటులు ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, అనుష్క, తమన్నా ధరించిన ఆభరణాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నగలను జైపూర్‌లోని అమ్రపాలి జువెల్లరీ ప్రతినిధులు తయారు చేశారు. కాగా, ఆయా నగలను హైదరాబాద్‌లోని అమ్రపాల్ జువెల్లరీలో ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా అమ్రపాలి ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు. ఈ నగలను వెండిపై బంగారం పూతతో తయారు చేశామని అన్నారు. అతి తక్కువ నగలకు మాత్రమే పూర్తిగా బంగారాన్ని వినయోగించామని చెప్పారు.
దీని కోసం ఎంతో మంది డిజైనర్లు పనిచేశారని అన్నారు. ముఖ్యంగా తాము దేవసేన అనుష్క వాడిన నగల కోసం అధికంగా కష్టపడవలసి వచ్చిందని, ఆ తరువాత రమ్యకృష్ణ పోషించిన శివగామి క్యారెక్టర్ కోసం చేసిన నగలకు ఎక్కువగా శ్రమించామని అన్నారు. ఈ సినిమా కోసం మొత్తం 1500 నగలు తయారు చేశామని చెప్పారు. తాము ఇప్పటికి పలు సినిమాల కోసం ఆభరణాలు తయారు చేశామని చెప్పారు. బాహుబలి కోసం తయారు చేసిన ఈ ఆభరాలన్నింటినీ భవిష్యత్తులో విక్రయించనున్నట్లు చెప్పారు.