: ‘ప్రభాస్ చెప్పే డైలాగ్’ డబ్ స్మాష్ చేసి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన క్రికెటర్


ఓట‌మి ఎరుగ‌ని ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెర‌కెక్కించిన 'బాహుబ‌లి-2' సినిమా మేనియాకు క్రికెట‌ర్లు కూడా ఫిదా అయిపోతున్నారు. ఈ సినిమాను చూసిన సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే.  తాజాగా ప్రముఖ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా బాహుబలి సినిమాపై త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా స్పందించాడు. బాహుబ‌లిని కట్టప్ప ఎందుకు చంపాడన్న రహస్యం అందరికీ తెలిసిపోయిందని ఆయన పేర్కొన్నాడు. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ చెప్పే డైలాగ్ కి డబ్ స్మాష్ చేసి మ‌రీ ఆ వీడియోని త‌న అభిమానుల‌తో పంచుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో విప‌రీతంగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. డైలాగ్ అదుర్స్ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.  


  • Loading...

More Telugu News