: అనాథ పిల్ల‌ల‌కు 'బాహుబ‌లి-2' సినిమాను చూపించిన స‌మంత


చెన్న‌య్ బ్యూటీ స‌మంత ఈ రోజు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ప‌లువురు అనాథ పిల్ల‌లకు హైద‌రాబాద్‌లోని ఓ థియేట‌ర్‌లో బాహుబ‌లి-2 సినిమా చూపించింది. ఆమె పుట్టిన రోజు, బాహుబ‌లి రీలీజ్ డేట్ ఒక‌టే కావ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా స‌మంతా మీడియాతో మాట్లాడుతూ... ప్ర‌త్యూష ఆర్గ‌నైజేష‌న్ పిల్ల‌లు త‌న‌తో క‌లిసి సినిమా చూడ‌డం త‌న‌కే ఆనందంగా ఉంద‌ని చెప్పింది. పిల్ల‌లందరికీ బాహుబలి చూడాలని పెద్ద కోరికగా ఉంటుంద‌ని, ఎంతో ఆత్రుత‌గా ఉంటార‌ని తెలిపింది.

వారి ముఖంలో సంతోషం చూస్తే త‌న‌కు ఆనందంగా ఉంటుందని అంది. చిన్న సాయం చేసినా పిల్ల‌లు వారి లైఫ్ లాంగ్ మ‌ర్చిపోరని చెప్పింది. బాహుబ‌లి సినిమా చాలా బాగుందని, రాజ‌మౌళి ఎంతో గొప్ప ద‌ర్శ‌కుడ‌ని ఆమె ప్ర‌శంసించింది. ఈ సినిమా గురించి, రాజ‌మౌళి గురించి ఒక్క పాయింట్‌లో చెప్ప‌లేమ‌ని ఆమె వ్యాఖ్యానించింది. చిన్నారులంతా సినిమా థియేటర్లోనే హ్యాపీ బర్త్ డే సాంగ్ పాడి సమంతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బాహుబలి సినిమా చూసినందుకు అంబరాన్నంటే ఆనందాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News