: రాజమౌళి గురించి చాలా మందికి తెలియని నిజం ఇది!
దర్శక దిగ్గజం రాజమౌళి సినిమాలో ఏదో ఒక సన్నివేశంలో దేవుడికి సంబంధించిన సన్నివేశం ఉంటుంది. కానీ, రాజమౌళి వాస్తవానికి దేవుడినే నమ్మడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చిన్నప్పటి నుంచి తాను నాస్తికుడిని కాదని... దేవుడుని నమ్మేవాడినని... యుక్త వయసులో ఉన్నప్పుడు పూజలు బాగా చేసేవాడినని రాజమౌళి చెప్పాడు. అయితే, ఎంత చేసినా తనకు ఎప్పుడూ సంతోషం, సంతృప్తి ఉండేది కాదని తెలిపాడు. ఆ తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చి... నాస్తికుడైన గుణ్ణం గంగరాజుతో కలసి పని చేయడం ప్రారంభించానని... ఆయన తనకు అయాన్ ర్యాండ్ రాసిన 'ఫౌంటైన్ హెడ్' పుస్తకాన్ని ఇచ్చారని... ఆ పుస్తకమే తన వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చివేసిందని చెప్పాడు. ఆ తర్వాతే తాను కూడా నాస్తికుడిగా మారానని తెలిపాడు.